Poweful & Emotional lyrics from Sirivennrla Seethaaram Sasthri gaari Pen - Mad Monkey

సిరివెన్నెర్ల సీతారాం శాస్త్రి గారి పెన్ నుండి అద్భుతమైన & భావోద్వేగ సాహిత్యం

రి పెన్"

మనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారివి చాలా పాటలు విన్నాం, పాడుకున్నాం.. ఇంకా చెప్పాలి అంటే చదువుకున్నాం... చదువుకోనీ నేర్చుకోవడం పాటలతో కూడా సాధ్యమే అవుతుంది అని ఈయన పాటలే నిరూపించాయి... ఆలో కనిపిస్తారు... చెప్పాలంటే స్వయంగా ఆయనే చెప్పినట్టు... కానీ ఆ చెప్పిన మాటల్లో యెంత నిజం ఉందండీ... మీరు ఆ లైన్స్ చూస్తే ఖచ్చితంగా అర్థమౌతుంది... ఆ లైన్స్ లో పచ్చి నిజం ఉంటుంది మరి... చూడండీ ఇంకా...



1) నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాణి యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

అర్థమౌతుంది కదా... ఈ లైన్లు ప్రస్తుత పరిస్థితిని ఏమన్నా సూచిస్తున్నట్టు అనిపిస్తోంది..! పోనీ అది పక్కానా పెట్టండి... జనాలు నిజంగా చాలా సార్లు ప్రూవ్ చేసుకుంటున్నారు సిగ్గు లేని వాళ్ళు అని... మనమేమీ మినహాయింపు కాదులే, అందుకే మనం కూడా ఆ జాతి రత్నాలమే... అలా, మనకి ఎవరు, యెన్ని చెప్పినా వినలేదు . .. అదే మారమని చెప్తున్నారు...


2) గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి

Yelaa padithe alaa thirigevaadiki, idhi cheyyaraa ani yenni saarlu chebithe yenti cheppandi... పేద చెవిని పెట్టిన వాడికి చెవిలో గట్టిగ అరిచిన వినపడదు... యేమని చెప్తే, ఏలా చెప్తే మారతావు..., చెప్పి యేం ప్రయోజనం అని ...
3) యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం

కుక్క నీ సింహాసనం మీద కూర్చుబెడితే ఏం చేస్తుందో అదే ఇక్కడ గొంతు చించుకొని చెబుతుంది... ఇప్పటి వరకు ఎవరు నేర్పించుకున్నారనీ, ఇప్పుడు కొత్తగా ఎవరెవరో నేర్చుకుంటారని ఆశ పడదానికి... యెంత గొప్పగా చెప్తాను. ఈనాడు కదా బాబాయ్...

4) రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిజమే కాదండీ... రావణుడిని చంపారు గానీ, రావణ మంస్థత్వాన్ని కాదుగా ఇంకా... మనిషిని చంపేస్తాం అన్నా కూడా పైశాచికం వినడం లేదు మరి... కురుక్షేత్రం జరగడానికి అప్పుడు చెప్పిన భగవద్గీత... వల్ల లాభాల కన్నా, నష్టాలే యెక్కువేమో.. . కానీ తీసేవాడిని బట్టి ఉంటుంది మరి...

5) పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా

అడవి మనిషి అంది, నాగరికత నేర్చాడని అనుకున్నా, ఆ నాగరికతను కూడా కాళుష్యం కోరల్లో పెట్టాడు కదా... బుర్రలు చేధలు పట్టి ఉన్నాయ్ కదా, యెంత తుడించినా పోనంతగా... ఆది మానవుడి నుండి మనవడికి అద్బుతంగా ఉంది ఇషీలా క్రూరంగానే బ్రతుకుతున్నాడు కదా అనేదే ఆవేదన...
6) వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

అప్పటికి ఇప్పటికి వేసుకొని బట్టలు మారాయి గాని, వాటి వెనుక మనసులు, పైనా బ్రెయిన్ లు అస్సలు మారలేదనే వాదన, అడవి మృగల్లా మారి తిరిగే జన వనం అనేది అందుకే కదా...

7) బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ

సింహం బలమయినది, అడవిలో ధెన్నయినా చంపి నీ శక్తి ధానికి ఉంది, అందుకే ఇంకే జంతువు దాని ముందు నిలవలేదు... ఆది అడవిలో సిద్ధాంతం... కానీ, అదే మార్గంలో ఇక్కడ కూడా బ్రతికితే అడవికి, ఈ పరిస్థితికి ఉంది...

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాణి యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం
గొప్పోల్లు ఊరికే చెప్పరు ఏదీ అని ఊరికే అంటారా మరో పెద్దోళ్లు... మరి ఇంకో గొప్పోళ్లకే అర్థం కావాలి ఈ గొప్ప సాహిత్యం...
- గణేష్ గుల్లిపల్లి

తిరిగి బ్లాగుకి